మంచిర్యాల జిల్లా ఆటో కార్మికుల సమస్యల పరిష్కరానికై మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెల్ల విక్రమ్ JAC జిల్లా అధ్యక్షులు కట్టా రాముకుమార్ గార్లు మాట్లాడుతూ,ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సౌకర్యార్ధకంగా ఉన్నప్పటికీ ఆటో కార్మికులు కిరాయిల్ లేక కుటుంబ పోషణ భారమై ఆటో ఫైనాన్స్ లు, ఇల్లు అద్దె, కరెంట్ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నిత్యావసర సరుకులు కొనలేక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి పైగా ఆటో కార్మికులు బలవన్మరణం చేసుకోవడం జరిగింది, ఆటో కార్మికులు రెక్కడితే గాని డొక్కాడని దయనియమైన పరిస్థితి ల్లో ఆటో కార్మిక సోదరులున్నారు, కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 న జరగనున్న అసంబ్లీ సమావేశం లో ఆటో కార్మికుల డిమాండ్లన్, నెరవేర్చాలని అందులో భాగంగా,
1) ఆటో డ్రైవర్ కు 12,000 వేల రూపాయలు ప్రతి నెల జీవన భృతి కల్పించాలి
2) 50 సంవత్సరాల పై బడిన ఆటో కార్మికునికి ప్రభుత్వం పరంగా పెన్షన్ కల్పించాలి
3) ఆటో కార్మికుడు ఏ కారణం చేతనైన చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయాలి
4) ఆటో వాహనానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించాలి
5) ఆటో ఫైనాన్స్ అధికా వడ్డీలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలి
6 ప్రభుత్వం ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి,అని తెలిపారు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ & ఓనర్స్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చెల్ల విక్రమ్, JAC ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా రాముకుమార్, జిల్లా సలహా దారుడు చల్ల గట్టయ్య, మంచిర్యాల పట్టణ తాత్కాలిక కమిటీ అధ్యక్షులు కలవేణి శేఖర్, నస్పూర్ కాలనీ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, సీసీసీ అధ్యక్షులు ఆవుల సుధాకర్ రైల్వే స్టేషన్ అధ్యక్షులు, పగడాల రాజేష్,కాలేజ్ రోడ్ అధ్యక్షులు M D షేఫీ,తిలక్ నగర్ అధ్యక్షులు బోరే వెంకటేష్, మార్కెట్ అధ్యక్షులు కలవల అంజన్న, Mch అధ్యక్షులు D రమేష్, జై సాయి అడ్డా అధ్యక్షులు తగరం శ్రీనివాస్,మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఆటో కార్మికులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు,

Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!