
చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ విడుదల దగ్గర పడింది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ ఫ్రైడే విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘నాది ప్రొఫెసర్ క్యారెక్టర్ కాదు. కానీ అంత జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎంచుకున్న మార్గం నక్సలిజం. ధర్మానికి అండగా నిలబడే వ్యక్తి కనుక ‘ఆచార్య’ టైటిల్ జస్టిఫై అయినట్టే. ‘రక్తసింధూరం’లో కూడా నక్సలైట్‌గా నటించాను. కానీ అందులో అగ్రెసివ్‌గా ఉండే క్యారెక్టర్. ఇందులో నాయకత్వ లక్షణాలు ఉండే పాత్ర. లోపల ఎంత ఆవేశం ఉన్నా పైకి చూపించడు. ఇక చరణ్‌ది చాలా కీలకమైన పాత్ర. కథను, కథనాన్ని, నా పాత్రను, ప్రేక్షకుల్ని కూడా కదిలించే క్యారెక్టర్. ఈ పాత్ర చేయడం చరణ్‌కి వీలు పడకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మరో బెస్ట్ ఆప్షన్ అయ్యుండేవాడు. నటన విషయంలో నేనెప్పుడూ చరణ్‌కి సలహాలు ఇవ్వలేదు, ఇవ్వను. ఎందుకంటే నేను సలహాలిస్తే నాలా అవుతాడు. తనకు తానుగా ఇంప్రూవ్ అవడంలోనే ఒరిజినాలిటీ ఉంటుంది. ఈ సినిమాలోని ఓ సీన్‌లో కలిసి నటించేటప్పుడు, చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి గ్లిజరిన్ లేకుండానే నాకు కన్నీళ్లు వచ్చేశాయి. తను మనసు పెట్టి నటించడం వల్లే అది సాధ్యమైంది. నేనెలాగూ పాతవాడినే. పాత, పాత కలిస్తే మోత తప్ప ఏమి ఉంటుంది! అందుకే ఈ తరం దర్శకులతో వర్క్ చేస్తున్నా (నవ్వుతూ). కొత్తవాళ్లయితేనే నన్ను నటుడిగా కొత్తగా ఆవిష్కరిస్తారు. ఫ్రెష్ థాట్స్‌ని ఎప్పుడూ ఆహ్వానించాలి. ప్యాండమిక్‌లో ప్రతి రంగం కుంటుపడింది. సినిమా రంగం కూడా. ఈ ఒక్క సినిమాకే యాభై కోట్ల ఇంటరెస్ట్ పడింది. ప్రభుత్వాలు కనికరించి టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు ఇవ్వడం, మేము అందించిన వినోదానికి ప్రేక్షకులు కొంత ఎక్కువ మొత్తం చెల్లించడం అనేది నష్టాలను భర్తీ చేయడానికే’ అన్నారు.
Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!