Theenmaar24x7

Spread the love

ముంబై : కొత్త జట్టు గుజరాత్‌‌ టైటాన్స్‌‌ మరోసారి సూపర్‌‌ హిట్‌‌ అయ్యింది. అఫ్గాన్‌‌ స్పిన్‌‌ గన్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌  (11 బాల్స్ లో 4 సిక్సర్లతో 31 నాటౌట్) బ్యాట్‌‌తో పేలిన వేళ మరో అద్భుతం చేసింది. ఆఖరి ఓవర్‌‌లో 22 రన్స్‌‌ అవసరమవగా..   తెవాటియా (21 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 40 నాటౌట్) ఒక సిక్స్‌‌, రషీద్‌‌ మూడు సిక్సర్లతో చెలరేగారు. దాంతో, బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో టైటాన్స్​ ఐదు వికెట్ల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై ఉత్కంఠ విజయం సాధించింది. లీగ్​లో తమకు తొలి ఓటమి రుచి చూపించిన రైజర్స్‌‌ను దెబ్బకు దెబ్బ తీసింది. బ్యాటింగ్‌‌లో  అభిషేక్ శర్మ (42 బాల్స్ లో 6 ఫోర్లు, 3  సిక్సర్లతో 65), మార్ క్రమ్ (40 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) దంచికొట్టినా..  బుల్లెట్లలాంటి బాల్స్‌‌తో  ఉమ్రాన్ మాలిక్ మాలిక్ (5/25) ఈ సీజన్ లోనే బెస్ట్  పెర్ఫామెన్స్ ఇచ్చినా ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్‌‌ డౌన్‌‌ అయ్యింది. తొలుత  హైదరాబాద్ 20 ఓవర్లలో 195/6 భారీ స్కోర్ సాధించింది. టైటాన్స్ బౌలర్లలో షమీ (3/39) మూడు వికెట్లతో రాణించాడు. ఛేజింగ్ లో  వృద్ధిమాన్‌‌ సాహా (38 బాల్స్ లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 68) మెరుపులకు తోడు  తెవాటియా, రషీద్ హిట్టింగ్​తో చివరి బాల్ వరకు ఆడిన టైటాన్స్ 199/5 స్కోర్ చేసి  గెలుపొందింది. ఉమ్రాన్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.ముంబై : కొత్త జట్టు గుజరాత్‌‌ టైటాన్స్‌‌ మరోసారి సూపర్‌‌ హిట్‌‌ అయ్యింది. అఫ్గాన్‌‌ స్పిన్‌‌ గన్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌  (11 బాల్స్ లో 4 సిక్సర్లతో 31 నాటౌట్) బ్యాట్‌‌తో పేలిన వేళ మరో అద్భుతం చేసింది. ఆఖరి ఓవర్‌‌లో 22 రన్స్‌‌ అవసరమవగా..   తెవాటియా (21 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 40 నాటౌట్) ఒక సిక్స్‌‌, రషీద్‌‌ మూడు సిక్సర్లతో చెలరేగారు. దాంతో, బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో టైటాన్స్​ ఐదు వికెట్ల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై ఉత్కంఠ విజయం సాధించింది. లీగ్​లో తమకు తొలి ఓటమి రుచి చూపించిన రైజర్స్‌‌ను దెబ్బకు దెబ్బ తీసింది. బ్యాటింగ్‌‌లో  అభిషేక్ శర్మ (42 బాల్స్ లో 6 ఫోర్లు, 3  సిక్సర్లతో 65), మార్ క్రమ్ (40 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) దంచికొట్టినా..  బుల్లెట్లలాంటి బాల్స్‌‌తో  ఉమ్రాన్ మాలిక్ మాలిక్ (5/25) ఈ సీజన్ లోనే బెస్ట్  పెర్ఫామెన్స్ ఇచ్చినా ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్‌‌ డౌన్‌‌ అయ్యింది. తొలుత  హైదరాబాద్ 20 ఓవర్లలో 195/6 భారీ స్కోర్ సాధించింది. టైటాన్స్ బౌలర్లలో షమీ (3/39) మూడు వికెట్లతో రాణించాడు. ఛేజింగ్ లో  వృద్ధిమాన్‌‌ సాహా (38 బాల్స్ లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 68) మెరుపులకు తోడు  తెవాటియా, రషీద్ హిట్టింగ్​తో చివరి బాల్ వరకు ఆడిన టైటాన్స్ 199/5 స్కోర్ చేసి  గెలుపొందింది. ఉమ్రాన్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× WhatsApp Us
×